TELANGANA GURUKUL-V-TG CET-2023

GURUKUL-V-TG CET-2023


TELANGANA GURUKUL-V-TG CET-2023 Common Entrance Test for Admission into 5th Class for the academic year 2023-2024 (in TREIS, TSWREIS, TTWREIS, MJPTBCWREIS)

TSWREIS, TTWREIS, MJPTBCWREIS & TREIS సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2023-24 సంవత్సరమునకు 5వ తరగతిలో ప్రవేశమునకు ఉమ్మడి పరీక్ష (V TG CET-2022)

కేజి టు పిజి మిషన్ లో భాగంగా బంగారు తెలంగాణ రూపొందించే క్రమంలో దళిత,గిరిజన, బహుజనులలో ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తునువేయడానికి ప్రభుత్వం వందలాదిగా గురుకులాలను స్థాపించి సకల సౌకర్యాలను కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుంది. వివిధ శాఖల ఆధ్వర్యములోని గురుకుల పాఠశాలల విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతూ 21వ శతాబ్దపు సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా తర్పీదు ఇస్తున్నాయి.

Important Dates:

Event Date
Date of opening of online application 09-02-2023
Last date for submission of application 06-03-2023
Hall Tickets download 10 Days before of Exam
Date of examination 23-04-2023 from 11 AM To 1 PM
Examination Fee Rs.100

GURUKUL-V-TG CET-2022:


ప్రవేశ పరీక్ష తేది: 23-04-2023(11 AM-1 PM)

ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రము తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలో ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించబడిన అన్ని జిల్లా కేంద్రాలలో, పరిసర ప్రాంతాలలో నిర్వహించబడును

అర్హత:

  1. వయస్సు: ఓ సి (OC) మరియు బి సి (BC) కులాలకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2014 లోపల పుట్టి ఉండవలెను (అంటే 9 సం లు నిండి ఉండవలెను కానీ 11 సం రాలు నిండరాదు).
  2. యస్ సి (SC) మరియు యస్ టి ల (ST) కు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2014 లోపల పుట్టి ఉండవలెను (అంటే 9 సం లు నిండి ఉండవలెను కానీ 13 సం రాలు నిండరాదు)
  3. SC కన్వెర్టర్ క్రైస్తవ విద్యార్థులు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య జన్మించినవారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు అర్హులు.
  4. సంవత్సర ఆదాయము రూరల్ వారికి 1,50,000/- అర్బన్ వారికి 2,00,000/- రూపాయలు వార్షిక ఆదాయము లోపు ఉండవలెను.
  5. 2022-23 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.(విద్యార్థిని,విద్యార్థులు ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా బోనపైడ్/స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.)

పాఠశాలల్లో ప్రవేశము:

  1. విద్యార్థుల ఎంపికకు “పాత జిల్లా” ఒక యూనిట్ గా పరిగణింపబడుతుంది.
  2. MJPTBCWRS కౌడిపల్లి పాఠశాలలో ప్రవేశమునకు గాను మత్స్యకార వృత్తికి చెందిన తెలంగాణలోని అన్ని జిల్లాలవారు అర్హులు. ఈ పాఠశాలలలో ప్రవేశానికి అభ్యర్థి ప్రతిభ, రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు.
  3. TRS సర్వేల్ (నల్గొండ జిల్లా) రీజనల్ సెంటర్ ఆప్ ఎక్స్ లెన్స్ పాఠశాలలో ప్రవేశానికి, తెలంగాణలోని అన్ని జిల్లాలవారు అర్హులు. ఈ పాఠశాలలో ప్రవేశానికి అభ్యర్థి ప్రతిభ, రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రవేశ పరీక్ష:

  1. ప్రవేశ పరీక్ష 1. తెలుగు, 2. ఇంగ్లీషు, 3. గణితము, 4.మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్ధ్యం), 5. పరిసరాల విజ్ఞానములలో 3, 4వ తరగతి స్థాయిలో 2 గం,,ల వ్యవధిలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది.
    తెలుగు-20 మార్కులు
    ఇంగ్లీషు-25 మార్కులు
    గణితము-25 మార్కులు
    పరిసరాల విజ్ఞానము-20 మార్కులు
    మరియు
    మెంటల్ ఎబిలిటీ-10 మార్కులతో).
  2. (OMR) ఓ. యం. ఆర్. షీట్ లో జవాబులు గుర్తించవలెను (Bubbling)
  3. విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నపత్రము మరియు నమూనా ఓ. యం. ఆర్. జవాబు పత్రములు పట్టిక (Annexure-ll) మరియు (Annexure-III) నందు ఇవ్వబడినవి.
  4. ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు

  1. సంబంధిత జిల్లా అధికారులచే నిర్ణయించబడిన పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వయించబడును.

దరఖాస్తు రుసుము:

  1. రూ.100/- ఆన్ లైన్ లో చెల్లించవలసి ఉంటుంది.

పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం

  1. ప్రవేశ పరీక్షలో ప్రతిభ (Merit in Test).
  2. రిజర్వేషన్ ప్రకారం (ఆయా సంస్థల నియమాల ప్రకారం).
  3. స్థానికత
  4. ప్రత్యేక కేటగిరి (మైనారిటీలు/అనాథ బాలబాలికలు/సైనికోద్యోగుల పిల్లలు/ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్ధులు/ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగస్తుల పిల్లలు).
  5. విద్యార్థుల ఎంపికలో సమానమైన మార్కులు, ఒకరికంటే ఎక్కువమందికి వచ్చినప్పుడు, పుట్టినతేది, గణితంలో మార్కులు, పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను ఒకటి తర్వాత ఒకటి వరుసగా పరిగణనలోకి తీసుకోని ర్యాంకు నిర్ధారిస్తారు.
  6. ఫిజికల్లీ హ్యాండీక్యాఖ్ (దివ్యాంగులు), సైనికోద్యోగుల పిల్లలకు సంబంధించిన రిజర్వేషన్ లు ఆయా కులానికి చెందిన రిజర్వేషన్ కోటాలోనే ఉంటుంది.
  7. ఏదైనా ఒక రిజర్వేషన్ కేటగిరిలో అభ్యర్థులు లేనియెడల అట్టి రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు కేటాయించే అధికారం ప్రధాన కన్వీనర్ గారికి ఉంటుంది.
  8. ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన (అంగవైకల్య, అనాధ, సైనికోద్యోగుల పిల్లలు) ఖాళీలు మిగిలినచో అట్టి ఖాళీలను మెరిట్ ప్రాతిపదికన ప్రభుత్వ సూచనల ప్రకారం కేటాయిస్తారు.
  9. అర్హులైన ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు / ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగస్తుల పిల్లలు లభించనియెడల అట్టి ఖాళీలు ఎస్టీ విద్యార్థులతో, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నింపబడును.
  10. ఎంపికైన అభ్యర్థులు ప్రవేశానికి ఏ కారణం చేతనైన అర్పులు కానిచో, అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు ప్రధాన కన్వీనర్ గారికి అధికారం ఉంది.
Latest Updates కోసం మా Whatsapp Group లో జాయిన్ కాగలరు.JOIN HERE

Latest Updates కోసం మా Telegram Group లో జాయిన్ కాగలరు.JOIN HERE

GURUKUL-V-TG CET-2023
Online Payment CLICK HERE
Online Appllication CLICK HERE
Notification CLICK HERE
Download Submitted Application CLICK HERE
DOWNLOAD MODEL OMR SHEET CLICK HERE
DOWNLOAD MODEL QUESTION PAPER CLICK HERE
DOWNLOAD RESULTS CLICK HERE
GURUKUL-V-TG CET-2023
Sharing Is Caring:

error: Content is protected !!